దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలని ఇందు కోసం రాబోయే రోజుల్లో తెలంగణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు మరింత సమర్థవంతంగా పని చేయాలని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలిపారు. ఈరోజు మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతు ఎన్నికల కంటే ముందు ఇదే వేదికగా మాట్లాడుతూ.. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి డిసెంబర్ 12న నేను వస్తాను అని చెప్పాను. గెలిస్తే మళ్లీ మీడియా ముందుకు వస్తాను.. గెలవకపోతే మళ్లీ కెమెరాలకు ముందు రాను అని ఈ వేదిక మీద చెప్పాను. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని రకాలుగా సహకరించినందుకు మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here