తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ రోజు ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేబినెట్ లో ఎవరికి స్థానం ఉంటుందన్న విషయంలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొని ఉంది. కేబినెట్ లో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ కేబినెట్ లో సీఎం సహా 18 మందికి మించకూడదు. ఈ నేపథ్యంలో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. గత కేబినెట్ లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి కేబినెట్ లో కచ్చితంగా మహిళకు స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు.
Subscribe
Login
0 Comments