తెలంగాణ ఎన్నికల ఫలితాలు , ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ . ఎన్నికల ఫలితాల విషయంలో అనేక ఊహాగానాలు వచ్చినా చివరకు 119 స్థానాలకు గాను 87 స్థానాలలో టీ ఆర్ ఎస్ పార్టీ గెలిచి విజయ దుంధిబి మోగించింది . అయితే ఇప్పుడు ఈ విషయంపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) నేషనల్ ప్రెసిడెంట్ దేవులపల్లి అమర్ స్పందించారు . ఆయన మాట్లాడుతూ ముందుగా ఎన్నికలలో గెలిచిన కే చంద్రశేఖర రావుకు అభినందనలు తెలిపారు . ప్రతిపక్షం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పై , ఈవీయం లపై బురదజల్లి ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక పధకాలు ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లక పోవడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయన్నారు . కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో సొంతంగా బరిలోకి దిగకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నారా చంద్రబాబునాయుడు తో కలిసి వెళ్లడం వలన అపజయం పాలయ్యారని , ఒక వేళ కూటమి కనుక గెలిస్తే మళ్ళీ చంద్రబాబు పెత్తనం వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తింటుందని కేసీఆర్ ప్రచారం చేయడం ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం , కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని , ఇవన్నీ కలిసొచ్చి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారన్నారు . అయితే తెలంగాణ రాష్ట్ర విజయాలపై ఒక దినపత్రికలో ఒక వ్యక్తి రాసిన కొన్ని విషయాలు కూడా పరిగణంలోకి తీసుకోవాలన్నారు . తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంలేని సంక్షేమ రాజ్యంగా మార్చారని , తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళే ఈ విధంగా చేయడం తగదని దాని సారాంశం అన్నారు . పోయిన ఎన్నికలలో మాదిరిగా కాకుండా ఈ సారి ఏకంగా 87 స్థానాలలో ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని అందుకని ప్రజాస్వామ్యంతో పాలించాలన్నారు . కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అప్రజాస్వామిక పధకాలు చేసినప్పటికీ అవి ప్రజలకు అర్ధం కాకపోవడం వలన ఈ విజయం వచ్చిందన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments