తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి. ‘కేటీఆర్‌..గురిచూసి కొడుతున్నార్‌..విజయం ఆయనదే..’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో మళ్లీ తెరాసే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు.

కాగా..కేటీఆర్‌ పోస్ట్‌ చేసిన ఈ కొత్త ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ స్పందించారు. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌..ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోపై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా కామెంట్‌ చేశారు. ‘ఈ ఫొటో కాన్ఫిడెన్స్‌కు కొత్త అర్థం చెబుతోంది. ఫలితాల నేపథ్యంలో కేటీఆర్‌ కొత్త ఫొటోను పెట్టారు’ అని ట్వీట్‌ చేశారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్‌ సరళిలో తెరాసే ముందంజలో ఉంది. ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యం దిశగా తెరాస ముందుకెళ్తోంది.ఇప్పటి వరకు తెరాస 82, ప్రజాకూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments