తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నారు. సమీప ప్రత్యర్థి నాయిని నరోత్తమ్రెడ్డిపై 51 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9రౌండ్లు పూర్తయ్యేసరికి 56,866 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ సైతం ఆధిక్యంలో ఉన్నారు. గజ్వేల్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కేసీఆర్ 14,841 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. సిరిసిల్లలో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కేటీఆర్ 34, 798 ఓట్లతో ముందంజలో ఉన్నారు.