దాదాపు పదకొండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ టెస్టులో విజయం సాధించింది.

అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించిన భారత్ ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ గెలిచిన భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ గెలిచిన భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

ఐదో రోజు చేతిలో ఆరు వికెట్లతో 219 పరుగుల విజయ లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కాసేపటికే ఐదో వికెట్ కోల్పోయింది.నాలుగో రోజు స్కోరుకు మరో మూడు పరుగులు జోడించిన ట్రావిస్ హెడ్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు.తర్వాత నాలుగో రోజు దాదాపు రెండు గంటలు పైగా క్రీజులో ఉండి 31 పరుగులు చేసిన షాన్ మార్ష్ 60 పరుగుల దగ్గర అవుటయ్యాడు.

కానీ కెప్టెన్ టిమ్ పేన్ భారత బౌలర్లను అడ్డుకుని కాసేపు ధాటిగా ఆడాడు. జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు.కానీ 41 పరుగులు చేసిన టిమ్ లంచ్ విరామం తర్వాత రెండో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడిపోయింది.

తర్వాత పేన్ స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ 28 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో అవుటవగా.. పాట్ కమిన్స్ నాతన్ లియాన్‌తో కలిసి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.కానీ అతడు కూడా 28 పరుగుల దగ్గర భూమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చివర్లో నాథన్ లియాన్, జోష్ హేజెల్‌వుడ్ ఓటమని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించారు.

కానీ అశ్విన్ బౌలింగ్‌లో హేజెల్‌వుడ్ కొట్టిన బంతి గల్లీలో ఉన్న కేఎల్ రాహుల్ చేతుల్లో పడడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments