హైదరాబాద్ పరిధిలోని ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్ లో ఈ ఉదయం ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ లో బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్, టీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్ లోకి వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. ఆయన పార్టీ కండువాతో రావడాన్ని గమనించిన బీజేపీ కార్యకర్త ప్రదీప్, ఇలా కండువాలు వేసుకుని రావడం నిబంధనలకు విరుద్ధమని, అలా ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం జరుగగా, ప్ర్రదీప్ పై దానం వెంట ఉన్న అనుచరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి,  చింతల రామచంద్రారెడ్డి, హుటాహుటిన అక్కడికి వచ్చి, ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here