మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, గుండె నొప్పితో ఆయన బాధపడుతున్నారు. సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడంతో ఆయనను సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీచేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments