తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నందమూరి ఎన్టీఆర్ తన కుటుంబంతో వచ్చి ఓటర్ల క్యూలో నిలబడ్డారు. తల్లి , భార్య ప్రణతీతో కలసి వచ్చి తన వోట్ ని వినియోగించారు.కాగ ఉదయం 9గంటలకు హైదరాబాద్‌లో 7శాతం, రంగారెడ్డిలో 8శాతం, కరీంనగర్ జిల్లాలో 10శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 11.5శాతం, నల్గొండ జిల్లాలో 6శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 5శాతం, ఖమ్మంలో 7శాతం, వరంగల్ జిల్లాలో 7శాతం, మెదక్ జిల్లాలో 7శాతం, నిజామాబాద్ జిల్లాలో 6శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.కాగ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని మరమ్మతులు చేస్తున్నారు. దీంతో అనేక చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఇంకా ప్రారంభం కాలేదు.
ఓట్ కోసం క్యూలో నిలబడ్డ ఎన్టీఆర్
Subscribe
Login
0 Comments