తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఎన్నికల అధికారి రజత్ కుమార్. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు వేయనున్నారని ఆయన చెప్పారు. 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చన్నారు రజత్ కుమార్. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో నిల్చుంటే ఓటువేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు వీవీప్యాట్‌లను అధికారులు తెరిచారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు.

ఉదయం 7 గంటలకే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధిపేట అభ్యర్థి హరీష్ రావు తన కుటుంబసభ్యులతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనదన్నారు హరీష్ రావు. ప్రతిఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here