తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన 374 పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి గంట సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

* యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో 7గంటలకు అధికారులు పోలింగ్‌ ప్రారంభించలేకపోయారు.

* కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్‌ పోలింగ్‌ కేంద్రంలోనూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు మొరాయించాయి.దీంతో ఓటర్లు తహసీల్దార్‌ వనజారెడ్డితో వాగ్వాదానికి దిగారు.

* హైదరాబాద్‌ జియాగూడ ఇందిరా నగర్‌లో 31,32 పోలింగ్‌  కేంద్రాలలో  ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments