సినీ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున తన సతీమణి అమలతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. ఓటు వేయడం ఎంతో ముఖ్యమని, ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఇది ఓటర్ల రోజని అన్నారు. తన కుటుంబ సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్‌ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అల్లు అర్జున్‌ విజ్ఞప్తి చేశారు. సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలింనగర్‌లో ఓటు వేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments