పప్పు లో కాలేసిన రాహుల్

867

అసలే ఎన్నికల సమయం. నేతలు ఆచి తూచి మాట్లాడాలి. ఏదైనా తప్పు దొర్లిందా ఇక అంతే. ప్రతిపక్ష నేతలు వాటిని పట్టుకొని ఏకిపారేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భాజపా నేతలకు అలాగే చిక్కారు. నిన్న రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుంభ రామ్‌ ఆర్య లిఫ్ట్‌ యోజన కెనాల్‌ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ.. ప్రాజెక్టు పేరును తప్పుగా పలికారు. కుంభరామ్‌కు బదులుగా కుంభకర్ణ అనేశారు. ఇంకేముందు దానికి సంబంధించిన వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిద్రపోతుందని చురకలేశారు.’అశోక్‌ గహ్లోత్‌ ‘కుంభకర్ణ లిఫ్ట్‌ యోజన’ కోసం నగదు ఇచ్చారు’ అని రాహుల్‌ ఒకానొక సందర్భంలో అన్నారు. వేదికపై పక్కనే ఉన్న వాళ్లు అది విని కుంభ రామ్‌ లిఫ్ట్‌ యోజన అని అందించారు. దీంతో ఆయన తన తప్పును సరిదిద్దుకున్నారు. ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ‘కుంభ రామ్‌ లిఫ్ట్‌ యోజన? ఆరు నెలల పాటు కుంభకర్ణుడు నిద్రపోయాడు. అలా కాంగ్రెస్‌ 60ఏళ్లుగా నిద్రపోతూనే ఉంది’ అంటూ పీయూష్‌ ట్వీట్‌ చేశారు. భాజపా ప్రతినిధి సంబిత్‌ పత్రా స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉందని అనుకుంటున్నారు. అంటే ఆయన ఓటర్లను కుంభకర్ణులు అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. గతంలో కూడా రాహుల్‌ ఇలాగే తప్పులో కాలేసి నాలుక్కరుచుకున్నారు. కొబ్బరి నీళ్లు అనడానికి బదులు కొబ్బరి జ్యూస్‌ అంటూ మీడియాకు చిక్కారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here