టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల్లో మద్దతు తెలుపుతోంది ఎంఐఎం పార్టీ. సీఎం కేసీఆర్ కూడా మజ్లిస్ తమ మిత్రపక్షమని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి మిత్రపక్షంపై మజ్లిస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అన్ని విధాలా సహకరించిన కారణంగానే, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని అక్బరుద్దీన్ చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాట వినకపోతే.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యూహం మారుస్తామని అక్బరుద్దీన్ హెచ్చరించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన అక్బరుద్దీన్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే, కేసీఆర్ బీజేపీ పక్షాన నిలబడతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 5 నుంచి 10 ఏళ్లు మాత్రమే పాలిస్తుందని.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్కు కాకుండా ప్రజలు ఏ పార్టీకి ఓటేసినా.. బీజేపీకి ఓటేసినట్టేనని అక్బర్ అన్నారు.
టీఆర్ఎస్ మాట వినకపోతే.. వ్యూహం మారుస్తాం
Subscribe
Login
0 Comments