మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. స్టాక్ మార్కెట్‌లో పలు కంపెనీలు తలపట్టుకుంటున్నాయి. ఏది కొనుగోలు చేయాలో దేనిని వదులు కోవాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాయి. మదుపరులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఇండియన్ కంపెనీలపై బడా కంపెనీలు కన్నేశాయి. వాటా తీసుకోవడమో లేక ఏకంగా భారీగా ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేయడమో చేస్తున్నారు. ఓయో, ఫ్లిప్ కార్ట్‌, స్నాప్ డీల్‌..ఇలా చాలా కంపెనీలు క్యూ కట్టాయి.

ప్రతి ఇంట్లో పిల్లలకు ఇష్టమైన పౌష్టికాహారాన్ని ఇచ్చే హార్లిక్స్ అమ్ముడు పోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. రాందేవ్ బాబా, బాలకిషన్‌ల ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి కొట్టిన దెబ్బకు విదేశీ కంపెనీలు అల్లాడుతున్నాయి. తాము తయారు చేసిన ప్రొడక్ట్స్ కంటే పతంజలి వస్తువులకే గిరాకీ పెరగడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నాయి. వాల్‌మార్ట్‌..ఫ్లిప్ కార్డ్ జత కట్టడంతో బిగ్ డీల్‌గా మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. ఇదిలా వుండగానే హార్లిక్స్‌ను తయారు చేసే గ్లాక్సో కంపెనీని హచ్ యు ఎల్ కొనేందుకు ఎంఓయు కుదుర్చుకుంది. అదేదో కోట్లల్లో అనుకుంటే పొరపాటే ఏకంగా 31 వేల 700 కోట్లకు స్వంతం చేసుకుని మదుపుదారులకు షాక్ ఇచ్చింది. ఇండియన్స్ ఫేవరేట్ డ్రింక్ హార్లిక్స్‌. గ్లాక్సో ఇండియాలో అతి పెద్ద తయారీదారు. హిందూస్తాన్ యూనిలివర్ దక్కించుకుంది. ఇదే భారీ డీల్‌గా రికార్డు . ఎఫ్ ఎంసీజే మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలిని ధీటుగా ఎదుర్కొనేందుకు కంపెనీలు తమ గేర్స్‌ను మారుస్తున్నాయి.

దేశంలో అతి పెద్ద వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి సంస్థగా హెచ్‌యుఎల్‌కు పేరుంది. యూనిలివర్‌తో పాటు నెస్ట్ లే , కోకాకోలా కంపెనీలు పోటీ పడ్డాయి. చివరకు యూనిలివర్ స్వంతం చేసుకుంది. మెడికేటెడ్ టూత్ పేస్ట్ సెన్ఫోడైన్‌, ఎసిడిటీని తగ్గించే ఇనో, సాధారణ జ్వరాలను తగ్గించే క్రోసిన్‌లను హిందూస్తాన్ లీవర్ కంపెనీ పరమయ్యాయి.

ఈ కొనుగోలు వల్ల ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, భారత్‌లో మరింత మార్కెట్ వాటాను దక్కించుకున్నట్లయింది. కొనుగోలు వల్ల ప్రతి ఈక్విటీ షేర్‌కు 4. 39 పైసలు వస్తాయి. జీఎస్‌కే, యూనిలివర్ కలిసి పోవడంతో ..5 వేల 584 కోట్లు, 17 వేల 677 కోట్లు ఒక్కటవుతాయి. జీఎస్‌కే వార్షిక టర్నోవర్ 3 వేల 591 కోట్లుంటే..హెచ్‌యుఎల్ టర్నోవర్ 7 004 కోట్లు ఉంది.

అమ్మకాల్లో హెల్త్ ఫుడ్ డ్రింక్ లో హార్లిక్స్ నెంబర్ ఒన్‌గా నిలుస్తోంది. 20 శాతం ఈబీఐటీ మార్జిన్‌తో 4 వేల 200 కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండియన్స్ కు ఆరాధ్యంగా ఉన్న హార్లిక్స్‌..కోట్ల వ్యాపారాన్ని కొల్లగొడుతోంది. ఓ రకంగా ఇండియన్ కంపెనీలకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. భారీ మార్కెట్‌..ఊహించని డిమాండ్‌..కాసులు కురిపించేలా చేస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments