రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ డీజీపీని మధ్యాహ్నం 2:15 గంటలకు హాజరుకావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే డీజీపీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలియజేశారు. తాము కూడా కోర్టు కేసుల విచారణలో బిజీగా ఉన్నామని… ఒక అరగంట సమయం డీజీపీ కోర్టుకు రావడానికి కేటాయించలేరా అని ప్రశ్నించింది. ఏది ఏమైనా డీజీపీ కోర్టుకు హాజరుకావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌‌ను అరెస్ట్ చేశారనే దానిపై సవివరమైన నివేదికను అందజేయాలని హైకోర్టు సూచించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments