ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తన సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురు గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెప్పారు. మరోవైపు ఓటింగ్ శాతం పెరిగితే కూటమికి అవకాశముంటుందని, తగ్గితే హంగ్ వచ్చే అవకాశమని చెప్పారు. నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి అనిల్ జాదవ్ గెలుస్తారని ఇప్పటికే చెప్పానని, ఇప్పుడు మరో మూడు పేర్లు చెబుతున్నానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి వినోద్ గెలుస్తారని చెప్పారు.
ఓటింగ్ పెరిగితే కూటమి క్లీన్‌స్వీప్
పోలింగ్ శాతం పెరిగితే కూటమి, తగ్గితే హంగ్ ఈసారి ఎన్నికలు పోటీపోటీగా జరుగుతాయని లగడపాటి చెప్పారు. వన్ సైడ్ జరిగే ఎన్నికలు కాదని చెప్పారు. ఈ విషయం అన్ని గ్రామాల్లోను తెలుసునని చెప్పారు. తెలంగాణలో ఈసారి పోలింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆసక్తికరమని చెప్పారు. ఓటింగ్ పెరిగితే ఫలితం ఓ రకంగా, తగ్గితే మరో రకంగా ఉంటుందని చెప్పారు. పోలింగ్ సరళి కూడా ఫలితాలను మార్చివేస్తాయని చెప్పారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగితే మహాకూటమికి అవకాశం ఉంటుందని, పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్‌కు అవకాశం ఉంటుందని లగడపాటి చెప్పారు. యథాతథంగా ఉంటే ఎవరు వస్తారో చెప్పలేమని అన్నారు.