కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్ కేసీఆర్ కుట్రే అని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని కేసీఆర్ వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సభ ఉంటే రేవంత్‌రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారన్నారు. ‘రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి జరిగితే…ఎలా ఉంటుందో కేసీఆర్ ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్‌ను జైపాల్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా అని నిలదీశారు.ఎన్నికల అధికారుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.