టీమిండియా నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని.. వీడ్కోలుకు సంబంధించిన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన గంభీర్‌.. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ లీగ్‌ల్లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. మంగళవారం ఆకస్మాత్తుగా అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించాడు..

37 ఏళ్ల గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. భారత జట్టులోకి పునరాగమనం కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ కూడా ఒకడు కావడం విశేషం. 2007 టీ20 ఫైనల్, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. రెండింట్లోనూ గౌతం టాప్ స్కోరర్ కావడం మరో విశేషం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments