కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కొడంగల్ కు సంబంధించి ఎన్నికల సంఘం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఇటు అధికారులు, అటు పోలీసులు టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.గులాబీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇది ఏమాత్రం సహించేది కాదని.. ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో హర్షించబోరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి పాలన కోరుకోవడం లేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్ ఖండించిన డీకే అరుణ
Subscribe
Login
0 Comments