జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తన వ్యూహం మార్చినట్టు అనిపిస్తోంది . తొలుత తాను అనంతపురం నుండి పోటీ చేస్తునట్టు వార్తలు వచ్చాయి . కానీ ఇప్పుడు ఆయన పోటీ చేసే నియోజకవర్గం విషయంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది . తనకు మొదటి నుంచి బలంగా భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ దృష్టి పెట్టారని అర్ధమవుతోంది . ముఖ్యంగా మాజీ కాంగ్రెస్ నేత అయినా నాదెండ్ల మనోహర్ పార్టీ లోకి అడుగుపెట్టిన తరువాత నుంచి పవన్ ప్రవర్తనలో వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే గత 20 రోజుల పైన పవన్ తూర్పు గోదావరి జిల్లాలోనే మకాం వేసి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు . అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక శాసనసభ నియోజకవర్గం నుండి పోటీకి దిగనున్నట్లు సమాచారం . అటు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న జిల్లా అవ్వడంతో పవన్ కు అక్కడే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల భావన …

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments