ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం అన్నిపార్టీల్లో ఊపందుకుంటుంది. ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓట్ల కోసం ప్రాధేయ పడే సమయం రానే వచ్చింది . అసలు విషయం ఇక్కడే బయటపడుతుంది.కామారెడ్డి లో అధికార ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరిని మించి ఒకరు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ జనాలు చాలా అప్రమత్తంగా వున్నారు. ఇన్నిరోజులు తాము ఎంతో సహనంగా వుంది ఈ రోజు కోసమే అని ప్రజలు గర్జిస్తూ మరి అధికార గర్వంతో స్థానిక ఎమ్మెల్యే చేసిన పనులను ఎండగడుతున్నారు. డబ్బులు కుమ్మరిస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే కు ప్రచారంలో చేదు అనుభవాలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి చేసిన సర్వేల్లో వెనకబడి ఉన్నట్టు గతంలో ఈ ఎమ్మెల్యే పై వచ్చిన వార్త కథనాలు మనకు తెలిసినవే. అయితే కొన్ని సంస్థలు తాజాగా నిర్వహించిన సర్వేలోనూ గంపగోవర్ధన్ వెనకబడే వున్నారు అని చెబుతున్నాయి. ఈ నాయకుడిపై విసిగి వేసారిన ప్రజలు ఇప్పుడు మా ఓటు షబ్బీర్ కె అంటున్నట్టు సమాచారం. ఆయన ప్రవర్తనే ఆయనను ఓటమికి దాదాపు చేరువ చేసిందని అద్భుతాలు జరిగితే తప్ప గంప గోవర్ధన్ గెలవలేరని ప్రజలు ప్రైవేట్ సర్వేల్లో చెబుతున్నారు. ఇప్పటివరకు వున్నా సర్వేల సమాచారంతో దాదాపు షబ్బీర్ గెలుపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి ..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments