తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. గురువారం ఉదయం పార్క్‌హయత్ హోటల్‌కు చేరుకున్న ఆయన ఎడిటర్స్‌తో సమావేశమయ్యారు. కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్‌లో రోడ్‌షోలు ప్రారంభించనున్నారు. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన చంద్రబాబు నిన్న ఖమ్మం, హైదరాబాద్‌లో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు శేర్‌లింగంపల్లిలో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లకు హాజరుకానున్నారు. సాయంత్రం కూకట్‌పల్లిలో చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన రాజేందర్‌నగర్‌లో ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
పార్క్‌హయత్‌లో ఎడిటర్స్‌తో చంద్రబాబు భేటీ
Date: