పల్లె కోయిలమ్మకు అరుదైన అవకాశం…కన్నీటి పర్యంతమైన బేబీ..

917

ఇటీవల పల్లె కోయిలమ్మగా పిలవబడుతున్న బేబీ గురుంచి తెలియని తెలుగువారండరు . సంగీత పరిజ్ఞానం ఏమాత్రం లేనప్పిటికీ తనదైన శైలిలో పాటలు పాడుతూ బేబీ ప్రఖ్యాతి సాధించింది . ఆమె పాటను విని ప్రఖ్యాత సంగీత దర్శకులు కోటి మరియు సీనియర్ గాయని ఎస్ . జానకి అభినందించిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు బేబీ కి మరొక ఊహించని అవకాశం లభించినట్టు తెలుస్తోంది . ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో గత కొన్ని దశాబ్దాలుగా గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యం ఒక సంగీత కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి స్వయానా ఎస్.పీ.బాలసుబ్రమణ్యం బేబీ గాత్రం నచ్చి ఆమెను ఈ కార్యక్రమానికి పిలిపించుకొని ఆమెతో ఒక పాటను పాడించినట్టు తెలుస్తోంది . ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తనకు చాలా మంది పాటల వీడియోలు పంపుతుంటారని అయితే ఆమె పాడిన పాటను విని ఆశ్చర్యపోయానని అన్నారు . తాను తన జీవితంలో ఊహించని విషయం జరగడంతో బేబీ సంతోషంతో కన్నీటి పర్యంతమయ్యిందని సమాచారం …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here