బాలసాయి బాబా కన్నుమూత

1263

కర్నూలు బాలసాయిబాబా కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం గుండెపోటుకు గురై మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయిబాబాపై అనేక అరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన మరణంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here