తెలుగు ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఈ మద్య అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఫృథ్వి ఇప్పుడు రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంత కాలంగా ఆయన ఏపి లో వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ కి నన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పై పలు మార్లు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఫృథ్వి నిర్మాత బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే బ్లేడు తో తన గొంతు కోసుకుంటానని బండ్ల గణేష్ అనడం పై తనకు ఆశ్చర్యం వేస్తుందని..దయచేసి ఆయన ఆత్మహత్యాయత్నాన్ని ఆడ్డుకోవాలని కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్షుడితో కూడా గణేష్ ఫొటో దిగే శక్తి ఉన్నోడని, తనకు అంత శక్తి లేదని అన్నారు.

ఇండస్ట్రీలో మేమంతా కలిసి మెలిసి ఉంటామని..బండ్ల మంచి నిర్మాత, నాకు మంచి స్నేహితుడు అని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన మహానేత కేసీఆర్ అని..ప్రజలు మళ్లీ ఆయనకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో మహాకూటమికి ఓటు వేస్తే… పరిపాలన అమరావతి నుంచి ఉంటుందని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments