జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్కీంను పకడ్బందీగా అమలు చేయాలి

0
390

జర్నలిస్ట్‌ హౌసింగ్ స్కీంపై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్కీంను పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. డిసెంబ‌ర్‌లో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కాల్వ తెలిపారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం కింద గ్రామీణ జర్నలిస్టులకు 5వేల ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. జర్నలిస్టులు తమ దరఖాస్తులను డీపీఆర్‌వో కార్యాలయంలో నోడల్‌ అధికారికి అందజేయాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here