ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రస్ ప్రచార దూకుడు పెంచారు. ఇక టీడీపీ కూడా స్టార్‌ క్యాంపెయినర్స్‌తో, తెలంగాణ గట్టుపై సత్తా చాటాలని ఆలోచిస్తోంది. మరి టీడీపీ స్టార్ క్యాంపెయిన్స్ ఎవరు….బాలయ్య షెడ్యూల్ ఏంటి.తారక్‌ వస్తాడా? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ దూకుతారా? లేదా? కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు ఖరారైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై చర్చ హోరాహోరిగా చర్చ సాగుతుంది.అయితే ఎన్టీఆర్ మాత్రం తప్పకుండా ప్రచారానికి రావాలంటూ పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావటంతో ఎన్టీఆర్ ఈమధ్యే తన సన్నిహితులు – కొద్దిమంది అభిమానులతో మంతనాలు జరిపాడట కాగా చివరకు మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం చూసి ఎన్టీఆర్ షాక్‌య్యాడట. ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిదని అభిమానులు తెలిపారట. నందమూరి ముద్దబిడ్డగా సుహాసిని పేరుప్రఖ్యాతలున్నాయి కాగా కూకట్‌పల్లిలో టీడీపీకి మొదటి నుంచే పట్టుంది. కార్యకర్తల అండదండ కూడా ఉంది. ఎన్టీఆర్ ప్రచారం చేసినా, చేయకపోయినా సుహాసిని గెలుపు ఖాయమేనని అభిమానులు స్పష్టం చేశారట. ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లనక్కర్లేదని తెల్చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రచారానికి దూరంగా ఉండాలనే ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments