కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించబోం

0
295

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌ సబ్‌కమిటీ గురువారం భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించబోమని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయలేమని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏడాదికి 10 రోజుల సెలవుతో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కొనసాగింపు జరుగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలలకు పెంచుతున్నట్లు తెలిపారు. వీటన్నింటిపై వచ్చే కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here