ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో నిర్వహించే ప్రజా సంకల్ప యాత్రకు మూడంచెల భద్రత కల్పిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. జగన్ చుట్టూ వలయంగా ఏర్పరుస్తామని, అందులోకి ముందుగా అనుమతి, వారి నడవడిక పరిశీలించాకే అనుమతులు ఇస్తామన్నారు. అనుమతిలేని వ్యక్తులను ఎవ్వరిని వలయంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నరసింహరావు, డీఎస్పీ సూర్య శ్రావణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, ఎస్బీ సీఐలు వైవీ శేషు, రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ జీఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రలో జగన్‌కు భద్రత ఇలా..!
Subscribe
Login
0 Comments