తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు శనివారం రత్నగిరిపై బసచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కార్యకర్తలతో అభిమానంగా వెళ్లి కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని ఈ సందర్భంగా పవన్‌కు ఆయన తెలియజేశారు. అంతకుముందు నాదెండ్ల మనోహర్‌తో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వీరిద్దరూ మంచి స్నేహితులు కావడంతో చాలాసేపు పాత విషయాలను నెమరు వేసుకున్నారు. యనమల కంచుకోట అశోక్‌బాబు ద్వారానే బద్దలైందని మనోహర్‌ చమత్కరించడంతో అశోక్‌బాబు వెంటవచ్చిన కార్యకర్తలు అభిమానులు చప్పట్లు కొట్టారు. ఆయన వెంట డీవీ రాజు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments