గీత గోవిందం చిత్రం తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన యంగ్ & క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..తాజాగా టాక్సీవాలా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గీత గోవిందం కంటే ముందే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా , అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు నవంబర్ 16 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం తో విజయ్ ఫ్యాన్స్ అంత హమ్మయ్య అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి వాయిదా వేసి సినిమా ఫలితం ఫై మరిన్ని అనుమానాలు పెంచారు.

నవంబర్ 16 న కాకుండా 17 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 16 న టాక్సీవాలా తో పాటు రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కూడా విడదల కాబోతుంది. ఒకే రోజు ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు వస్తే ఓపెనింగ్స్ ఇబ్బంది అవుతుందని చివరి నిమిషం లో టాక్సీవాలా ను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. వాయిదా విషయాన్నీ కొద్దీ సేపటి క్రితమే ప్రకటించారు.

నూతన దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments