కేరళలోని పవిత్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సోమవారం తెరుచుకోనుంది. దీంతో శబరిమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇక్కడ ఆంక్షలు విధించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పంబ నుంచి సన్నిధానం వరకు దాదాపు 1500 మంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేసినట్లు పథనంథిట్ట ఎస్పీ నారాయణ్‌ తెలిపారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments