రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్‌ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎండగట్టాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరని విమర్శించారు. కేసీఆర్‌ అక్రమాలను ప్రశ్నించినందుకే ప్రతిపక్షపార్టీల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. చింతమడక ఛీటర్‌ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. త్వరలో రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను కొడంగల్‌లో 30వేల మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి వల్ల లాభమే తప్ప నష్టం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు డబ్బులతో ఓటర్లను కొనలేరని పేర్కొన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం ఎలాగో తనకు కొడంగల్‌ నియోజకవర్గం అలాగేనని స్పష్టం చేశారు. తనకు 2009లో 7 వేల మెజారిటీ, 2014లో 15 వేలు వచ్చిందని గుర్తు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments