బాబుపై విరుచుకుపడ్ద పవన్

516

ఒకప్పుడు చంద్రబాబు సమర్ధ ముఖ్యమంత్రి. చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులకు నైతిక ప్రవర్తన ప్రదర్శించటానికైనా పబ్లిక్లో తమ నడవడికలో పొరపొచ్చాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడేవారు. తప్పులు జరిగితే సిగ్గుపడే వారు. చంద్ర బాబు తాను ముఖ్యమంత్రి అయ్యాక నిస్సిగ్గుగా అపరాధాలు చేస్తూ అదే సరైన విధానాలుగా ప్రజల్లో వ్యాప్తి చేయటం మరింత సిగ్గులేని తనం. ఓటుకు నోటు కేసులో ఒక ప్రజాప్రతినిధిని ప్రలోభానికి గురిచేసి పిరాయింపు ప్రోత్సహించటం ద్వారా తెలంగాణా ఏసిబి చాకచక్యంగా బుక్చేయగా దాన్ని నేరం కాదు అని కోర్టుల్లో తన మానేజ్మెంట్ టెక్నిక్ ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తు నారు. ఇదీ చంద్రబాబు నైజం.

నేఱాన్ని చట్టంలో ఉన్న లొసుగుల అధారంగా నేఱం కాదని ఋజువు చేయటానికి ప్రయత్నించే క్రిమినాలజీని నరనరాన జీర్ణించుకున్న ఈ వ్యక్తి ప్రజలకు చెసే మేలు కంటే తన స్వలాభం చూసుకోవటమే మునిగిపోతారని తెలంగాణా ప్రజల అభిప్రాయం.అలాంటి చంద్రబాబు పై పవన్ కళ్యాన్ “కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వెనకేసుకు రావడానికి తానేమీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లా అవకాశవాదిని కాదు” అని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్. సామాజిక మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించానని, బీజేపీలోనో, లేక ఇతర పార్టీలలోనో కలపడానికి కాదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో శనివారం జరిగిన బహిరంగసభలో జనసేన అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్రం మెడలు వంచేందుకు జాతీయ నేతలను కూడగడుతున్నానని చెబుతున్న నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీతో గొడవ పెట్టుకునే నైతిక బలం లేదని అభిప్రాయ పడ్డారు. టీడీపీ అవినీతిలో భాగస్వామ్యం పంచుకోవడం ఇష్టంలేని కారణంగా తాను ఒక్క పదవిని కూడా స్వీకరించలేదని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళ లను టీడీపీ కార్మికులుగా చేశారని నారా చంద్రబాబు నాయుడును విమర్శించారు. ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడలేని చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గా కొనసాగటానికి సమర్ధుడేనా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.

వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్టుపనులు ఇప్పించడంలోఉన్న ఉత్సాహం, తన నియోజకవర్గంలో కాలుష్యాన్ని నివారించ డంలో లేదంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం జరిగిందనిపిస్తే ప్రత్యేక హోదా కోసం ఉమ్మడిగా పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉండాలన్నారు. ఇలాంటి విష యాలలో యనమల, చంద్రబాబుకు సలహా ఇవ్వడం మంచిదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలవలేని నారా లోకేశ్, ‘పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి’ గా ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here