జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈవో జితేంద్ర ఆధ్వర్యంలో అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు మహాదాశీర్వచనాలిచ్చారు. పవన్‌కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ తదితరులున్నారు.ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో ఏలేరు రైతులతో పవన్ సమావేశమవుతారు.ఇక సాయంత్రం 5 గంటలకు జగ్గంపేట బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా నవంబర్ 02 న రైలు యాత్ర చేసారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు.