నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాల్లో తన నటవిశ్వరూపం చూపిస్తూనే… మరోవైపు టీడీపీ పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో నందమూరి హీరోలు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గతం టీడీపీ మహానాడు సభలకు పలుసార్లు హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా కళ్యాణ్ రామ్ టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఏరియా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణతో తనకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని, ఇంకా పదేళ్ల వరకు సినిమాలే చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేశాడట. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు… కళ్యాణ్ రామ్ తో రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసి, అతన్ని కన్విన్స్ చెయ్యాలని బాలకృష్ణను కోరారని తెలుస్తోంది. వచ్చే ఎలెక్షన్స్ లో కళ్యాణ్ రామ్ తో పోటీ చేయించాలనేది చంద్రబాబు ఆలోచనట. మరేం జరుగుతుందో చూడాల్సిందే.