మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నరు..

602

కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని, కాంగ్రెస్సోళ్లు, చనిపోయిన వ్యక్తుల పేరుతో దొంగ వేలిముద్రలు వేసి అక్రమ కేసులు వేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యాదగిరిగుట్టలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ముసలి నక్క కాంగ్రెస్, గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల సీట్ల కేటాయింపు చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందన్నారు.

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్నపింఛన్ ను రూ. 2,016 పెంచుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పింఛన్ వయోపరిమితిని 58ఏళ్లకు తగ్గించబోతున్నామని, నిరుద్యోగుల కోసం నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పించబోతున్నామని చెప్పారు. దేశంలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకేవిడతలో రూ.1 లక్ష రైతు రుణాలు మాఫీ చేస్తాం. యాదాద్రి టెంపుల్ ను తిరుపతికి ధీటుగా తీర్చిదిద్దుతున్న ఘనత మన కేసీఆర్ కే దక్కింది. గొంగిడి సునీత మరోసారి భారీ మెజార్టీతో గెలవబోతుందని మంత్రి కేటీఆర్ ధీమావ్యక్తం చేశారు. రాయగిరి వరకు మెట్రోరైల్ రాబోతుంది.

ఆలేరు నియోజకవర్గంలో లక్షా 70 వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తాం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 స్థానాలు గెలిచి, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆలేరుకు సాగునీరు రావాలంటే సునీతను మళ్లీ గెలిపించాలి. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా హామీనిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here