తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని ఆ పార్టీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కమిషన్ల రూపంలో దండుకునే డబ్బులతో మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని ఆమె ఆరోపించారు. వరంగల్ రూరల్ జిల్లా, పరకాల నియోజకవర్గంలో పలు పార్టీల కార్యకర్తలు కొండ దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పరకాల నియోజకవర్గం ప్రజలందరూ కేసీఆర్ పాలనపై విసుగుచెందారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా అని ఎదురు చూస్తున్నారని సురేఖ అన్నారు. ఒక్క పరకాల నియోజకవర్గం ప్రజలేకాదు… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్‌కు పట్టంకట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు.

కేసీఆర్ కూటమి.. అంటే ఆయన కుటుంబం చేసే పనులవల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సురేఖ అన్నారు. వారివి మాటలు తప్ప చేతలు లేవని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజల సొమ్మును పర్సంటేజ్ రూపంలో కోట్లు దండుకుని, ఆ డబ్బునే ఖర్చుపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని సురేఖ విమర్శించారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments