క్రిష్‌కు గురజాడ పురస్కారం

593

గురజాడ విశిష్ఠ పురస్కారంను ఈ సంవత్సరం సినీ దర్శకులు జాగర్లమూడి క్రిష్‌కు ఇస్తున్నామని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. ఈ నెల 30న మహాకవి గురజాడ 103వ వర్థంతి జరగనున్నది . విజయనగరంలోని గురజాడ గృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వర్థంతిని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతన్నామని తెలిపారు. వర్థంతి నాడు గురజాడ పురస్కారాన్ని వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులకు అంజేస్తునమన్నారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతి ని పురస్కరించుకొని ఈ సంవత్సరం సినీ దర్శకులు జాగర్లమూడి క్రిష్ కు ఈ పురస్కారంను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here