మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా నేచురల్‌గా వచ్చేందుకు చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలో చేరి షూట్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. 2012 లండన్ ఒలంపిక్స్‌లో గగన్ బ్రోంజ్ మెడల్ అందుకున్నారు.
చిరు కోసం గగన్ ఒక గంట పాటు సమయం వెచ్చించి షూటింగ్లో బేసిక్స్‌ను నేర్పిస్తున్నారు. అకాడమీలో ఫస్ట్ సెషన్ పూర్తైందట. గగన్.. చిరుకి షూటింగ్లో ఫండమెంటల్స్, కొన్ని ట్రిక్స్ నేర్పించారట. ఎయిర్ పిస్టల్స్, రైఫిల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో చిరు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అయితే నెక్ట్స్ సెషన్ ఎలా ఉండబోతోందనేది తెలియరాలేదు. చిరు, గగన్ సినిమా, సమాజం గురించి కాసేపు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.