సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ 5జీ ఐఫోన్‌ను 2020లో విడుదల చేయవచ్చని తెలిసింది. ఆ ఏడాది రానున్న ఐఫోన్లలో ఇంటెల్‌కు చెందిన 8161 5జీ మోడెమ్ చిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భవిష్యత్తులో విడుదల కానున్న ఐఫోన్లన్నింటిలోనూ ఇంటెల్ మోడెమ్స్ ఉండనున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఇంటెల్ 8060 మోడెమ్స్‌ను తయారుచేసే పనిలో పడింది. ఈ మోడెమ్స్‌ను 5జీ ఐఫోన్లలో అమర్చి యాపిల్ ఆ ఫోన్లను పరీక్షించనుంది.

5జీ మోడెమ్ చిప్స్ కోసం గతంలో యాపిల్ క్వాల్‌కామ్, మీడియాటెక్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ ఆ సంస్థ ఇంటెల్ వైపే మొగ్గు చూపింది. కాగా మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లోనే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై 5జీ ఫోన్లు విడుదలవుతాయని తెలుస్తున్నది. ఈ రేసులో ఒప్పో, హువావే, షియోమీ, శాంసంగ్ కంపెనీలు నిలిచాయి. ఈ కంపెనీలకు చెందిన 5జీ ఫోన్లలో క్వాల్‌కామ్ మోడెమ్ చిప్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మరి 5జీ ఫోన్లు ఏ ప్లాట్‌ఫాంపై ముందుగా వస్తాయో వేచి చూస్తే తెలుస్తుంది..!

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments