ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్క్రిప్ట్ ఢిల్లీ నుంచి వస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విభజన హామీలు అమలుచేయకుండా బీజేపీ మోసం రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలకు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత లేదని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.