వయసు తో సంబంధం లేకుండా ఓ పక్క సినిమాలు , మరో పక్క రాజకీయాలు చేస్తూ నందమూరి బాలకృష్ణ రేయి పగలు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈయన నందమూరి తారకరామారావు జీవిత కథ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు. కేవలం నటించడమే కాదు నిర్మాత కూడా వ్యవహరిస్తున్నారు.డిసెంబర్ నాటికీ సినిమా అంత పూర్తి చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఫిబ్రవరి లో మరో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో ఓ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేయాలనీ బాలయ్య ప్లాన్ చేసారు. 2002లో ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ, దాదాపు 16 ఏళ్ల తరవాత మరోసినిమా తో కలవబోతున్నారు. బాలయ్య స్పీడ్ చూసి అభిమానులే కాదు యంగ్ హీరోలు సైతం ఆశ్చర్య పోతున్నారు.
Subscribe
Login
0 Comments