అత్తను కోడలు బిందెతో కొట్టి చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగిలో జరిగింది. కుటుంబ కలహాలతో అత్తాకోడళ్ళ మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అత్త తలపై కోడలు బిందెతో బలంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అత్త మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments