రాష్ట్రంలో రాజకీయాలు పుంజుకున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా ముం దుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందంజలో ఉంది. పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరులోనే ఎన్నికల యుద్ధానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తన తండ్రి గతంలో పాదయాత్ర చేసి వెంటి లేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌కు జీవం పోసి.. అధికారంలోకి తెచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా ఆయన కు ఉప యోగపడుతుందని ఆయన భావించారు. భారీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని గత ఏడాది నవంబరు నుంచి పాదయాత్ర కొన సాగిస్తున్నారు. ఇక, పార్టీ అభ్యర్థుల విషయంలోనూ జగన్ అందరి అంచనాలకూ భిన్నంగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో ఎన్నారైలకు పెద్దపీట వేశారు. వీరికి స్థానిక సమస్యలు తెలియకపోయినా.. ప్రజలు మాత్రం వీరిని ఆదరిస్తా రనే గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇక, ప్రభుత్వ వైఫల్యాలు, తనపై జరుగుతున్న దాడులను కూడా రాజకీయంగా జగన్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు విజయం ఖాయమని, సీఎం సీటు తనదేనని జగన్ భావిస్తున్నారు. అయితే, జగన్ అనుకుంటున్నట్టుగా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆయన సింగల్‌గానే అధికారంలోకి రావడం సాధ్యమా? ఇప్పుడున్న రాజకీయాలు ఆయనకు ఎంత మేరకు సక్సెస్ రేటును అందిస్తాయనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.

వీటిని పరిశీలిస్తే.. జగన్ కు అంత సానుకూలత ఏర్పడేలా పరిస్థితి లేదని అంటున్నారు విశ్లేషకులు. తల తన్నేవాడిని మించిన రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధినేత చంద్రబాబును నిలువరించడం జగన్‌కు సాధ్యం కాదనే విషయం తెరమీదికి వస్తోంది. జగన్‌ను మించిన వ్యూహంతో బాబు దూసుకుపోతున్న విషయాన్ని వారు చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు చెలిమి చేశారు. అయితే, అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు మారిన పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా నేపథ్యంలో బీజేపీకి ఏపీలో ఎదురుగాలులు వీస్తున్నాయి. దీంతో బాబు వ్యూహాత్మకంగా బీజేపీకి గుడ్ బైచెప్పి ఇప్పుడు తీవ్ర విమర్శలుగుప్పిస్తున్నారు. ఇక, ఇదే పార్టీతో జగన్ జట్టుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరి దీనని ఆయన ఎలా ప్రజల్లోకి తీసుకు వెళ్తారనేది ప్రశ్నార్థకం. ఏపీకి హోదా ఇవ్వని పార్టీతో వైసీపీ జట్టుకట్టి ప్రయోజనం సాధించడం అసాధ్యం. ఇక, ఏపీని విభజించిన కాంగ్రెస్‌తో బాబు జట్టుకట్టారు. అయితే, ఆయన లాజిక్‌గా ముందుకు వెళ్తున్నారు. హోదా ఇస్తామని చెబుతున్నారు కాబట్టే తాను కాంగ్రెస్‌తో చేతులు కలిపానని అంటున్నారు. దీనిని ప్రజలు అంగీకరించేలా ఆయన ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామం.. జగన్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. ఇలా ఎలా చూసినా.. జగన్ వ్యూహం బెడిసి కొడుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments