నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతమడక చీటర్ కేసీఆర్ తనపై కక్ష కట్టారన్నారు. ‘నన్ను ఓడించేందుకు రూ. 100 కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్ పంపించారు’ అని ఆరోపించారు. కొడంగల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ నమ్మకాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలి
Subscribe
Login
0 Comments