ఏపీ సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు చంద్రబాబును నమ్మొద్దన్నారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు. దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరని….నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని పోసాని తెలిపారు. తాను టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ తక్కువ వ్యవధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేసీఆర్ దేశంలోనే ఉత్తమ సీఎంలలో ఒకరని పోసాని కృష్ణ మురళి కొనియాడారు.
Subscribe
Login
0 Comments