ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా సెల్యూలార్ సంస్థ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే వొడాఫోన్ ఇండియా రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఐడియా రూ.159 ప్లాన్…

రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.

ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ….

ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ లోకేషన్ ఆధారంగా ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు 4జీ నెట్‌వర్క్ నుంచి 3జీ లేదా 2జీకి మారుతూ ఉంటోంది. కానీ జియో అందుబాటులో ఉన్న అన్ని సర్కిళ్లలోనూ యూజర్లు 4జీ నెట్‌వర్క్‌నే వినియోగించుకోవచ్చు….

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments