అప్పుడు చంద్రబాబు, జగన్, చిరంజీవి.. ఇప్పుడు పవన్ కల్యాణ్

0
245
జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలిరోజు బసను సత్యదేవుని సన్నిధిలోనే ఏర్పాటు చేశారు. తుని బహిరంగ సభ ముగించుకుని ఆయనకు సత్యగిరి కొండపై కేటాయించిన సీతా అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. గతంలో రాజకీయ పర్యటనలకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌, ప్రజారాజ్యం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న చిరంజీవి వీరంతా రత్నగిరిపై బస చేసిన వారే.
ఎటువంటి రాజకీయ ముఖ్యపదవి లేకపోవడంతో దేవస్థానం అధికారులు పవన్‌కల్యాణ్‌ బస చేసిన అతిథిగృహానికి నిబంధనల ప్రకారం జనసేన నాయకుల నుంచి అద్దె కట్టించుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో జనసేనాని సమావేశమయ్యారు. శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అధికారులు దీన్ని ధ్రువీకరించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here